IND vs SA | వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే దాయాదీ పాకిస్తాన్‌తో పాటు నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా నాలుగు పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్ వర్షార్పణం కావడంతో మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంతో సెమీస్‌కు అర్హత సాధించడం దాదాపు ఖాయం కావడంతో ఇరు జట్లు కసరత్తులు చేస్తున్నాయి.