నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో బ్రూక్స్ అవుట్. షాదాబ్ పాకిస్థాన్ జట్టుకు కీలకమైన సమయంలో వికెట్ సాధించాడు. పన్నెండో ఓవర్లో బ్రూక్స్, షాహీన్ ఆఫ్రీదికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్రూక్స్ 20 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ క్రీజ్‌లోకి వచ్చాడు. బెన్‌స్టోక్స్ 28 పరుగులతో, మొయిన్ ఆలీ 3 పరుగులతో ఆడుతున్నారు. నసీం షా బౌలింగ్‌లో స్టోక్స్‌ని రనౌట్ చేసే అవకాశం పాకిస్థాన్ జట్టు కోల్పోయింది.ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 30 బంతుల్లో 49 పరుగులు చేయాలి. అది కూడా ఓవర్‌కి 8కి పైగా రన్‌రేట్‌తో రన్స్ స్కోర్ చేయాలి.