T20 World Cup 2026 : పొట్టి ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవలే ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్ విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC).. టికెట్ల అమ్మకాలను సైతం ప్రారంభించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ టికెట్లు డిసెంబర్ 11, గురువారం సాయంత్రం 6:45 నుంచి అందుబాటులో ఉంటాయని ఐసీసీ సీఈఓ సనోజ్ గుప్తా (Sanoj Gupta) వెల్లడించారు. అభిమానులను భారీగా స్టేడియాలకు రప్పించాలనే ఉద్దేశంతో టికెట్ కనీస ధరను రూ.100గా నిర్ణయించామని సీఈఓ తెలిపారు.
భారత గడ్డపై ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. రెండు దేశాల్లోని ఎనిమిది నగరాల్లో ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ గురువారం మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు తెరతీసింది. టికెట్ల కోసం https://tickets.cricketworldcup.com సైట్లోకి వెళ్లాలి. ఈ సైట్ అడ్రస్‌పై క్లిక్ చేస్తే నేరుగా ‘బుక్‌మైషో’ (Book My Show) వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ బిగ్ ఈవెంట్ టికెట్లను కొనుక్కోవచ్చు. రూ.100 నుంచి మ్యాచ్ టికెట్ ధర షురూ కానున్నందున భారీగా అమ్ముడుపోతాయని ఐసీసీ భావిస్తోంది.
𝗬𝗢𝗨𝗥 𝗦𝗘𝗔𝗧 𝗜𝗦 𝗪𝗔𝗜𝗧𝗜𝗡𝗚 👀
Grab your tickets to the ICC Men’s #T20WorldCup 2026 when sales open on 11 December at 6:45 PM IST and join fans from around the world in the stands 🏆 pic.twitter.com/2pbjpYxrIk
— ICC (@ICC) December 11, 2025
‘టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ రూ.100 తో ప్రారంభమవడం టోర్నీపై ఆసక్తిని పెంచేస్తుంది. ఆధునిక వసతులు, స్టేడియంలో సందడితో క్రికెట్‌ను ఎంతో ప్రేమించే భారతీయులకు వరల్డ్ క్లాస్ మ్యాచ్ అనుభూతి కలిగిస్తాం. క్రీడాభిమానులందరూ ఒకచోట కలిసి సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ టోర్నీ మహత్తర అవకాశం. ఈ విశ్వ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాల బోర్డులు, సంస్థలతో సహకారం తీసుకుంటున్నాం. వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూసి జీవితకాల జ్ఞాపకాలను మిగిల్చుకునేందుకు వచ్చే భారత, విదేశీ అభిమానుకులకు స్వాగతం పలుకుతున్నాం’ అని సనోజ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపాడు.
భారత్, శ్రీలంక గడ్డపై వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల పొట్టి ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ షురూ కానుండగా.. అదే రోజు రాత్రి 7 గంటలకు ముంబైలో భారత్, అమెరికా తలపడనున్నాయి. అర్హత సాధించిన 20 జట్లను గ్రూప్‌లుగా విభించింది ఐసీసీ. ఒక్కదాంట్లో ఐదు చొప్పున నాలుగు గ్రూప్‌లను చేసింది. ఆతిథ్య దేశమైన టీమిండియా గ్రూప్‌లో పాకిస్థాన్ మాత్రమే పెద్ద జట్టు. కానీ, శ్రీలంక గ్రూప్‌లో ఆస్ట్రేలియా ఉండడంతో ఆ జట్టుకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. ఇక గ్రూప్ 3లో ఇంగ్లండ్, వెస్టిండీస్.. గ్రూప్ 4లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి టెస్టు క్రికెట్ ఆడే జట్లు ఉన్నాయి.
2⃣0⃣ teams. 4⃣ groups. One epic showdown🏏🏆
Dive into all four groups and teams for the T20 World Cup 2026, India and Sri Lanka are ready to host a blockbuster.#T20WorldCup2026 pic.twitter.com/XEdvVTNfOn
— CricTracker (@Cricketracker) November 25, 2025
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.
ఫిబ్రవరి 7 – పాకిస్థాన్ vs నెదర్లాండ్స్ – కొలంబో, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 7 – వెస్టిండీస్ vs బంగ్లాదేశ్ – కోల్‌కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 7 – భారత్ vs యూఎస్ఏ – ముంబై , రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 8 – ఇంగ్లండ్ vs నేపాల్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 8 – శ్రీలంక vs ఐర్లాండ్ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 9 – బంగ్లాదేశ్ vs ఇటలీ – కోల్‌కతా, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 9 – జింబాబ్వే vs ఒమన్ – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 10 – పాకిస్థాన్ vs యూఎస్ఏ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 11 – ఆస్ట్రేలియా vs ఐర్లాండ్ – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 11 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 12 – శ్రీలంక vs ఒమన్ – క్యాండీ, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 12 – భారత్ vs నమీబియా – ఢిల్లీ, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 13 – ఆస్ట్రేలియా vs జింబాబ్వే – కొలంబో, ఉదయం 11:00 గంటలకు.
Ready to defend the title on home soil 🇮🇳 🏆
Here are #TeamIndia‘s group stage fixtures for the ICC Men’s T20 World Cup 2026! 🗓️#T20WorldCup pic.twitter.com/MdL6Qa9mlg
— BCCI (@BCCI) November 25, 2025
ఫిబ్రవరి 13 – యూఎస్ఏ vs నెదర్లాండ్స్ – చెన్నై, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 14 – ఐర్లాండ్ vs ఒమన్ – కొలంబో, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 14 – ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ – కోల్‌కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 15 – వెస్టిండీస్ vs నేపాల్ – ముంబై, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 15 – యూఎస్ఏ vs నమీబియా- చెన్నై, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 15 – భారత్ vs పాకిస్థాన్ – కొలంబో, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 16 – ఇంగ్లండ్ vs ఇటలీ – కోల్‌కతా, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 16 – ఆస్ట్రేలియా vs శ్రీలంక – క్యాండీ, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 17 – బంగ్లాదేశ్ vs నేపాల్ – ముంబై, రాత్రి 7:00 గంటలకు.
SAVE THE DATES! 😍
The ICC Men’s #T20WorldCup 2026 schedule is out! 📝
Which match are you most excited for? 👇 pic.twitter.com/ziVrO8RiXj
— Star Sports (@StarSportsIndia) November 25, 2025
ఫిబ్రవరి 18 – పాకిస్థాన్ vs నమీబియా – కొలంబో, మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 18 – భారత్ vs నెదర్లాండ్స్ – అహ్మదాబాద్, రాత్రి 7:00 గంటలకు.
ఫిబ్రవరి 19 – వెస్టిండీస్ vs ఇటలీ – కోల్‌కతా, ఉదయం 11:00 గంటలకు.
ఫిబ్రవరి 19 – శ్రీలంక vs జింబాబ్వే – కొలంబో మధ్యాహ్నం 3:00 గంటలకు.
ఫిబ్రవరి 20 – ఆస్ట్రేలియా vs ఒమన్ – క్యాండీ, రాత్రి 7:00 గంటలకు.