T20 World Cup | నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు బెంగళూరులోని భారత (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోని క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌లో సాధన చేసింది. త్వరలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేపాల్ జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నేపాల్ జట్టు శిక్షణ పొందేందుకు బీసీసీఐ సహకారం అందిస్తున్నది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్లకు సన్నాహకంగా నేపాల్ జాతీయ జట్టు రెండువారాల ప్రత్యేక శిబిరంలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రాక్టీస్ చేసిందని, జట్టు సౌకర్యాలను ఉపయోగించుకుందని బీసీసీఐ పేర్కొంది. త్వరలో ఎదురయ్యే సవాళ్లకు తమను సిద్ధం చేసుకునేందుకు నైపుణ్యం, ఫిట్నెస్, ఇతర పరిస్థితులపై పని చేసిందని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్లకు ముందు ఆటగాళ్ల నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ శిబిరం లక్ష్యం.
నేపాల్ పురుషుల జట్టు గత సంవత్సరం ఆగస్టులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ప్రాక్టీస్ చేసింది. భారతదేశంలో జరిగిన దేశీయ ప్రాక్టీస్ టోర్నీల్లో పాల్గొంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అయితే, యూఏఈలో ఏడాది జరుగనున్న ఆసియా కప్ టీ20కి నేపాల్ జట్టు అర్హత సాధించలేకపోయింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్లో జరిగే టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్-పాక్ మధ్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయిలో జరుగనున్నది. అయితే, భారత జట్టు ఈ మ్యాచ్ ఆడుతుందా ? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టీమిండియా టోర్నీని మొదలుపెడుతుంది.
As part of their preparation for the ICC Men’s T20 World Cup Qualifiers, the Nepal national team trained at the BCCI Centre of Excellence over a focused two-week camp 👌
Making full use of the facilities, the team worked across skill, fitness, and game scenarios to gear up for… pic.twitter.com/Xr7XPbHghr
— BCCI (@BCCI) August 12, 2025