శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Sports - Jul 07, 2020 , 09:32:39

టీ20 వరల్డ్‌ కప్‌ వాయిదా..?

టీ20 వరల్డ్‌ కప్‌ వాయిదా..?

మెల్‌బోర్న్‌:  ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో  ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20  వరల్డ్‌కప్‌ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.   సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం సన్నద్ధమవ్వాలంటూ ఆసీస్‌ ఆటగాళ్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి  ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆస్ట్రేలియా  మీడియా తెలిపింది.  ఐతే వరల్డ్‌కప్‌ నిర్వహణపై ఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

ప్రపంచకప్‌ రద్దైతే అదే సమయంలో  ఐపీఎల్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.  లాజిస్టిక్‌ సమస్యల కారణంగా అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు  జరగాల్సిన  వరల్డ్‌కప్‌ను వాయిదా వేసేందుకు ఐసీసీ సిద్ధమైందని త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఆస్ట్రేలియా పత్రిక పేర్కొంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo