మొహాలి : దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చాంపియన్షిప్లో పంజాబ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పంజాబ్ 20 పరుగుల తేడాతో బరోడాని ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగుల భారీ స్కోరును సాధించింది. అన్మోల్దీప్ సింగ్ సెంచరీ(61 బంతుల్లో 113) సాధించగా, నేహల్ వధేర మెరుపు ఇన్నింగ్స్(27 బంతుల్లో 61)తో ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సమాధానంగా బరోడా చివరివరకు గట్టిపోటీ ఇచ్చి 7 వికెట్లకు 203 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిమన్యు(61), కెప్టెన్ కృనాల్ పాండ్యా(45), సోలంకి(28) విజయంకోసం పోరాడినా ఫలితం లేకపోయింది. అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్నాడు.