Big Bash League : టీ20ల్లో సంచలనం నమోదైంది. సిడ్నీ థండర్స్ జట్టు అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆ జట్టు 15 పరుగులకే ఆలౌట్ అయింది. టీ 20 క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా సిడ్నీ థండర్స్ రికార్డుల్లోకి ఎక్కింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు చతికిలపడింది. ఆడిలైడ్ బౌలర్లు విజృంభించడంతో ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టారు. దాంతో, ఆ జట్టు 5.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయింది. 124 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాప్ స్కోర్ ఎంతో తెలుసా.. 4 పరుగులు. అది కూడా పదో స్థానంలో వచ్చిన బ్రెండన్ డగ్గెట్ 4 రన్స్ చేశాడు.
సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు ‘వెస్టర్న్ సిడ్నీ ఎలా ఆడిందో దేశానికి చూపించాలి’ అని ట్వీట్ చేసింది. అయితే ఆ జట్టు దారుణంగా ఓడిపోవడంతో ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. దాంతో, లెట్స్ షో ద నేషన్ ట్వీట్ వైరల్ అవుతోంది. సిడ్నీ థండర్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్, మాథ్యూ గిల్కిస్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ జట్టు 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌరల్ హెర్నీ థార్న్టన్ 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
టీ 20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్లు ఇవే.. 2019లో చెక్‌రిపబ్లిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకు ఆలౌట్ అయింది. లెసొథోస్ జట్టు 26 పరగులతో మూడో స్థానంలో ఉంది.
0
0
3
0
2
1
1
0
0
4
1No its not my phone number, Sydney Thunder just registered Lowest ever T20 score in BBL.
— Saeed Cricky🏏 15 BBL (@SaeedCricky) December 16, 2022