సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆదివారం నుంచి మొదలయ్యే ఐదో టెస్టు పోలీసుల పహారాలో జరుగనుంది. ఇటీవల బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించిన నేపథ్యంలో ఆఖరి టెస్టుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇ బ్బంది కలుగకుండా పటిష్టమైన భద్ర త కల్పించినట్లు స్థానిక పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మౌంటెండ్ పోలీ స్, రాయిట్ స్వాడ్ ఆఫీసర్లు నిరంతరం గస్తీ కాయనున్నారు.