మసొన్ (యూఎస్): టాప్ ర్యాంకు టెన్నిస్ ప్లేయర్లు ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్), జన్నిక్ సిన్నర్ (ఇటలీ), అలగ్జాండెర్ జ్వెరెవ్ (జర్మనీ) సిన్సినాటి ఓపెన్‌లో సెమీస్‌కు చేరారు. యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ స్వియాటెక్ 4-6, 6-3, 7-5తో మిర్రా ఆండ్రివా (రష్యా)ను ఓడించి సెమీస్ చేరింది.
మరో క్వార్టర్స్‌లో సబలెంక.. 6-3, 6-2తో సమ్సొనొవ (రష్యా)పై అలవోకగా గెలుపొందింది. సెమీస్‌లో స్వియాటెక్, సబలెకం తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిన్నర్.. 4-6, 7-5, 6-4తో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో సిన్సినాటి ఓపెన్ సెమీస్‌కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా అతడు రికార్డులకెక్కాడు. మరో క్వార్టర్స్‌లో జ్వెరెవ్, రునె (కెనడా), టియాఫొ (అమెరికా) ముందంజ వేశారు. సిన్నర్-జ్వెరెవ్, టియాఫొ-రునె మధ్య సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి.