న్యూఢిల్లీ: భారత స్టార్ అథ్లెట్, ఆసియా గేమ్స్ హెప్టాథ్లాన్ మాజీ విజేత స్వప్న బర్మన్ డోపింగ్ పరీక్షలో పట్టుబడింది. నిషేధిత స్టెరాయిడ్ బోల్డెనోన్ వాడినట్లు నిర్ధారణ కావడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. 2018 జకార్తా ఆసియా గ్రేమ్స్ హెప్టాథ్లాన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన స్వప్న బర్మన్ ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
కాగా, వరుస గాయాల సమస్యల కారణంగా స్వప్న ఈ నెల ఆరంభంలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. ఆట నుంచి తప్పుకున్నప్పటికీ డోప్ పరీక్షలో పట్టుబడటంతో నిబంధనల ప్రకారం ఆమె విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని నాడా స్పష్టం చేసింది. మరోవైపు రెండోసారి డోపీగా తేలిన మాజీ ఒలింపియన్, జావెలిన్ త్రోవర్ శివ్‌పాల్ సింగ్‌పై నాడా పదేండ్ల నిషేధం విధించింది.