Iga Swiatek : మహిళల టెన్నిస్‌లో మరో సంచలనం. ఒకప్పుడు వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ (Iga Swiatek) మియామి ఓపెన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో ఈ టాప్ సీడ్ అనూహ్యంగా ఓటమి పాలైంది. రెండు గంటల 10 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పోలె మగ్ద లినెట్టే చేతిలో స్వియాటెక్ చిత్తైంది.
ఫేవరెట్‌గా ఇంటర్ మియామి ఓపెన్‌లో బరిలోకి దిగిన ఇగా స్వియాటెక్‌కు భారీ షాక్ తగిలింది. తొలి రౌండ్లోనే ఘోర పరాజయం చవిచూసిందీ మూడో ర్యాంకర్. 50వ ర్యాంకర్ పోలె మగ్ద లినెట్టే తొలి సెట్ నుంచి జోరు చూపించి 6-1, 5-7, 6-3తో స్వియాటెక్‌కు చెక్ పెట్టింది. దాంతో, డబ్ల్యూటీఏ టూర్లో తొలి రౌండ్లో 73 విజయాల రికార్డుకు బ్రేకు వేసింది.
The moment Magda Linette beat Iga Swiatek in Miami & ended Iga’s streak of 73 consecutive opening round matches won.
The last time they played, Magda only won 2 games.
Jawdropping performance.
Unforgettable moment for her & her team.
🇵🇱🥹
— The Tennis Letter (@TheTennisLetter) March 20, 2026
ఊహించని పరాజయం అనంతరం మాట్లాడుతూ.. ‘నేను ఓడిపోయానంటే నమ్మబుద్ది కావడం లేదు. రాను రాను టెన్నిస్ ఆట కష్టంగా అనిపిస్తోంది . ఈ ఆట చాలా తేలిక అనుకున్నా. కానీ, కోర్టులో మానసికంగా మనం ఎలా ఉంటామనేది చాలా కీలకం. ఇది నాకొక చెత్త మ్యాచ్. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటా. మళ్లీ నా పనిలో మునిగిపోతా. ప్రాక్టీస్ చేస్తాను. పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. నా ఆటను మెరుగుపరచుకుంటా’ అని స్వియాటెక్ చెప్పింది.