మెదక్ అర్బన్ : మెదక్ పట్టణంలో రంజాన్ తోఫాల ( Ramadan Gifts ) పంపిణీలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ( BRS Councillors ) ,నాయకులు అడిషనల్ కలెక్టర్ నాగేష్కు ఫిర్యాదు ( Complaints ) చేశారు. ముస్లిం సోదరులకు చెందాల్సిన గిఫ్ట్ ప్యాక్స్‌ను సంబంధిత అధికారులు కాకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకుని, మజీద్ కమిటీలకు అందించకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు .
పేద ముస్లింలకు చేరకుండా ఇతరులకు పంపిణీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని గిఫ్ట్ ప్యాక్స్‌ను అర్హులకు పంపిణీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు బట్టి ఉదయ్, సోహెల్, జుబేర్ అహ్మద్, గౌస్ ఖురేషి, దీపక్, నాయకులు మాయా మల్లేష్ ,నవీన్ ,బాలరాజు, ఫాజిల్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.