హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో గల్ఫ్ కార్మికులకు ( Gulf Workers ) మొండి చేయి చూపించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షులు (BRS NRI President ) రాధారపు సతీష్ కుమార్ ( Sateesh Kumar ) ఆరోపించారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలుతీసుకుంటామని , ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిందని అన్నారు. గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికి రూపాయి కూడా కేటాయించలేదు. ఉపాధి కోసం తెలంగాణ వాసులు 15 లక్షల మందికి పైగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వారికి నేడు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం గల్ఫ్ లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్‌లో ఉంటున్న కార్మికులకు అండగా ఉండాల్సిన సమయంలో కనీసం గల్ఫ్ కార్మికులకు ఒక్క పైసా కేటాయించక పోవడం బాధాకరమని అన్నారు. గల్ఫ్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు సరైనా ఉపాధి గల్ఫ్ దేశాలకు వలసలు పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని విమర్శించారు. రానున్న రోజుల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.