ముంబై: ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. అయితే అతని స్థానంలో సూర్యాన్ష్ షెడ్జ్‌ను తీసుకున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతను ఎంపికయ్యాడు. తొడ కండరాల గాయం వల్ల నితీశ్ రెడ్డి ఆ సిరీస్‌లకు దూరం అయ్యాడు. జూన్ 20వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి గాయపడ్డాడు. అయితే మెడికల్ బృందం ఇచ్చిన సూచన మేరకు అతను బెంగుళూరులోని సీఓఈలో కోలుకోనున్నాడు. దీంతో అతను రెండు టీ20 సిరీస్‌లకు దూరం అయ్యాడు.
ఇటీవల ఇండియా-ఏ తరపున అద్భుతమైన రీతిలో సూర్యాన్ష్ ప్రదర్శన ఇచ్చాడు. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో సూర్యాన్ష్ రాణించాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆ 23 ఏళ్ల క్రికెటర్ అక్కడ ఆడిన 5 మ్యాచుల్లో 147 రన్స్ స్కోరు చేశాడు. ఆ టోర్నీలో 23 ఓవర్లు కూడా వేశారు. ఇటీవల ముంబై జట్టు తరపున మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున లోయర్ మిడిల్ ఆర్డర్లో 251 స్ట్రయిక్ రేట్‌తో 131 రన్స్ చేశాడు.
🚨 News 🚨
Suryansh Shedge replaces injured Nitish Kumar Reddy in #TeamIndia‘s squads for Ireland and England series.
More Details 🔽 | #IREvIND | #ENGvIND https://t.co/M92NI1TbE0
— BCCI (@BCCI) June 23, 2026