ఒకప్పుడు బరిలోకి దిగాడంటే తనకు మాత్రమే సాధ్యమయ్యే అప్పర్ కట్స్, ర్యాంప్ షాట్స్, ఆఫ్‌సైడ్ స్కూప్స్, హైరిస్క్‌తో కూడిన స్వీప్స్‌తో క్రికెట్ పుస్తకాల్లో ఇప్పటి వరకూ కనివినీ ఎరుగని షాట్లతో అబ్బురపరిచే సూర్యకుమార్ యాదవ్‌కు ఇప్పుడేమైంది? ప్రత్యర్థి జట్టులో ఎంతటి దిగ్గజ బౌలర్ బంతినందుకున్నా.. అతడు ఎంత క్లిష్టమైన డెలివరీని సంధించినా.. తనదైన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న ‘నయా 360’లో దూకుడు తగ్గిందా? ఒకప్పుడు మంచినీళ్లు తాగినంత ఈజీగా బ్యాటింగ్ చేసిన ‘స్కై’.. ఇప్పుడు పట్టుమని పది బంతులు కూడా ఆడకుండానే వెనుదిరుగుతుండటం టీమ్ఇండియాను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ ముందున్న వేళ కెప్టెన్ ఫామ్ మెన్ ఇన్ బ్లూకు గుబులు పుట్టిస్తున్నది.
16 ఇన్నింగ్స్‌ల్లో 717 రన్స్. బ్యాటింగ్ సగటు 65.18తో ఐదు అర్ధ శతకాలు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో సూర్య ప్రదర్శన అది. ముంబై ఇండియన్స్‌ను ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో సూర్యది కీలకపాత్ర. కానీ అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి 2025లో భారత టీ20 సారథి ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ ఏడాది 21 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన రన్స్ 218 మాత్రమే. సగటు 13.62 కాగా ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. స్ట్రైక్‌రేట్ సైతం 123.16గా నమోదైంది. మరో రెండు నెలల్లో స్వదేశంలో సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో నాయకుడి ఫామ్ అభిమానులను ఆందోళనకు గురిచేసేదే!
2021లో జట్టులోకి అరంగేట్రం చేసిన స్కై.. రెండేండ్ల పాటు సూపర్ డూపర్ ఫామ్‌తో ఆనతికాలంలోనే స్టార్‌గా ఎదిగాడు. ఎంట్రీ నుంచి 2023 దాకా 57 ఇన్నింగ్స్‌ల్లోనే 45.55 సగటుతో ఏకంగా 2,141 రన్స్ చేసి తన కెరీర్లోనే పీక్స్ చూశాడు. ఆ రెండేండ్ల కాలంలోనే అతడు 4 శతకాలు బాది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సుమారు ఏడాదిపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. కానీ 2024 నుంచి ఈ ముంబై బ్యాటర్ ఫామ్ క్రమంగా తగ్గుతూ (అంతర్జాతీయ స్థాయిలో) వస్తున్నది. 2024లో 17 ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. 26.81 యావరేజీతో 429 రన్స్ చేశాడు. ఇక ఆ ఏడాది రోహిత్‌శర్మ టీ20ల నుంచి తప్పుకున్నాక సారథ్య పగ్గాలు అందుకున్న తర్వాత సూర్య ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య ఘోరంగా విఫలమయ్యాడు.
సారథిగా విజయవంతమవుతున్నప్పటికీ బ్యాటర్‌గా మాత్రం సూర్య దారుణంగా విఫలమవుతున్నాడు. నిరుటి కంటే అధ్వాన్నంగా ఈ ఏడాది సూర్య 21 టీ20 ఇన్నింగ్స్‌ల్లో చేసినవి 218 పరుగులే. అర్ధ శతకం చేసి 22 ఇన్నింగ్స్‌లు దాటింది. చివరిసారిగా అతడు 2024 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 75 రన్స్ చేయడమే గడిచిన రెండున్నరేండ్లలో అత్యధిక (వ్యక్తిగత) స్కోరు. ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపిన సూర్య.. భారత్ తరఫున మాత్రం తేలిపోతున్నాడు. జట్టులో ప్యూర్ బ్యాటర్‌గా 43.40గా ఉన్న అతడి సగటు.. కెప్టెన్‌గా మాత్రం 25.03గా ఉంది. జట్టును సక్సెస్‌ఫుల్‌గా (అతడి నాయకత్వంలో భారత జట్టు 39 మ్యాచుల్లో ఏకంగా 28 గెలిచి ఆరింట్లో మాత్రమే ఓడింది) నడిపిస్తున్నా బ్యాటర్‌గా మాత్రం అతడి ప్రదర్శన దారుణంగా ఉంది. ఈ గణాంకాలతో అతడు జట్టులో కేవలం బ్యాటర్‌గా కొనసాగుంటే ఇన్నాళ్లూ టీమ్‌లో చోటు దక్కేది అనుమానమే! కెప్టెన్సీ భారం సూర్య బ్యాటింగ్‌పై పడుతుందన్నది కాదనలేని నిజం. ఇక మరోవైపు 2026 టీ20వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఏడాది కాలంగా నిరాటంకంగా ప్రయోగాలు చేస్తూనే ఉంది. సాధారణంగా మూడో స్థానంలో వచ్చే సూర్య.. ఈ ప్రయోగాల కారణంగా ఏ మ్యాచ్‌లో ఏ స్థానంలో వస్తున్నాడనే దానిపైనా స్పష్టత లేదు. ఇది అతడి ప్రదర్శనపైనా తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు ఆడేది ఇంకా 5 మ్యాచ్‌లే. ఈ నేపథ్యంలో ఇకనైనా సూర్య మేల్కోకుంటే అది మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.
స్వదేశం వేదికగా టీ20 ప్రపంచకప్ సమయం ఆసన్నమైన వేళ కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన నెలకొన్నది. మెగాటోర్నీ నాటికి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సూర్య తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించే అవకాశముంది. ప్రపంచకప్ టోర్నీకి జట్టును ప్రకటించిన తర్వాత మీడియాతో సూర్య మాట్లాడుతూ ‘నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాను. కానీ మ్యాచ్‌లోకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తలక్రిందులు అవుతున్నది. ఇది ఒక చిన్న అవరోధం మాత్రమే. ప్రతీ ఒక్కరి కెరీర్లో ఇది కామన్. ఆ చిన్న లోపమేంటో తెలియడం లేదు. కచ్చితంగా తిరిగి పుంజుకుంటానన్న నమ్మకం నాకుంది. త్వరలో మీరు మళ్లీ కొత్త సూర్యను చూస్తారు’ అని అన్నాడు. మెగాటోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న కివీస్‌తో టీ20 సిరీస్ వచ్చే నెల 11 నుంచి మొదలుకానుంది. ప్రపంచకప్ టోర్నీ నాటికి తన పాత ఫామ్‌ను పుణికిపుచ్చుకునేందుకు సూర్యకు ఇది మంచి అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే పొట్టి ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమ్ఇండియా సొంత ఇలాఖాలో టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది.

0 అంతర్జాతీయ టీ20ల్లో గత 22 ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ కనీసం ఒక్కసారి కూడా అర్ధసెంచరీ మార్క్ అందుకోలేక పోయాడు.