చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డికాక్..త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ(20) సహకారం అందిస్తుండగా సూర్య కుమార్ యాదవ్(40) దూకుడుగా ఆడుతున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్లో యాదవ్ వరుసగా 6,4,4 బాది 16 రన్స్ సాధించాడు. 8 ఓవర్లకు ముంబై వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
Surya on the charge as @ImRo45 & @surya_14kumar bring up a brilliant 50-run partnership between them 💪
— IndianPremierLeague (@IPL) April 13, 2021
Live – https://t.co/CIOV3NuFXY #KKRvMI #VIVOIPL pic.twitter.com/UVhHofeHHj