Irfan Pathan | టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంశల జల్లు కురిపించాడు. అతని ఆట తీరులో రోహిత్ శర్మ ఛాయలున్నాయని కొనియాడారు. ఒక టీం లీడర్‌గా అతను జట్టును నడిపించటంలో సేమ్‌టు సేమ్ రోహిత్‌ను తలపిస్తాడని పఠాన్ అన్నారు. టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నప్పటికీ అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదన్నారు.
Suryakumar Yadav | ‘రోహిత్ శర్మ తరువాత కెప్టెన్సీ బాధ్యలు తీసుకున్న సూర్య.. భారత జట్టును ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించాడు. అతని కెప్టెన్సీలో 41 టీ20లు ఆడిన భారత్ 31మ్యాచ్‌లు గెలిచింది. 2025 ఆసియా కప్‌ను సైతం స్వాధీనం చేసుకుంది. సూర్య కుమార్ జట్టు కెప్టెన్‌గా అద్భుత ఫలితాలు సాధించినప్పటికీ అతను వ్యక్తిగతగా పరుగులు చేయడంలో విమర్శలకు గురయ్యాడు. ముఖ్యంగా 2025లో ఆడిన మ్యాచ్‌లలో అతను చెప్పుకోదగిన పరుగులు చేయలేకపోయాడు. Suryakumar Yadav | మొత్తం 21 మ్యాచ్‌లు ఆడిన సూర్య కేవలం 218 పరుగులు సాధించాడు. టి20 ప్రపంచ కప్‌కు ముందు సూర్యకుమార్ అతని ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరముంది’ అని పఠాన్ అన్నాడు. కెప్టెన్‌గా అతను వరల్డ్‌కప్‌లో ఖచ్చితంగా ఆడతాడని పేర్కొన్నాడు. కానీ అంత కంటే ముందు అతను పరుగులు చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన అవసరముందని పఠాన్ అబిప్రాయపడ్డాడు.