IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది. మొదట సూర్యకుమార్ యాదవ్(73 నాటౌట్) మెరుపు అర్థశతకంతో భారీ స్కోర్ చేసిన ముంబై.. ఆ తర్వాత ప్రత్యర్థిని వణికించింది. పేసర్లు టాపార్డర్‌ను కూల్చగా.. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్(3-11) సంచలన స్పెల్‌తో ఢిల్లీ మిడిలార్డర్ పని పట్టాడు. ముస్తాఫిజుర్‌ను బుమ్రా(3-12) బౌల్డ్ చేయడంతో 59 పరుగుల తేడాతో ముంబై జయకేతనం ఎగురవేసింది. దాంతో. నాకౌట్ పోరుకు దూసుకెళ్లాలనుకున్న ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి.
వాంఖడేలో ముంబై ఇండియిన్స్ విజయగర్జనతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా రెండు ఓటములు.. ఆపై కోల్‌కతాపై విజయం.. అనంతరం ఆర్సీబీ చేతిలో ఓటమి.. ఆనక వరుసగా ఆరేసి విక్టరీలతో ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన ముంబై.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను నాకౌట్ చేసింది.
The quest for Title No. 6⃣ is alive 🏆
Congratulations to @mipaltan who become the fourth and final team into the #TATAIPL 2025 playoffs 💙 👏#MIvDC pic.twitter.com/gAbUhbJ8Ep
— IndianPremierLeague (@IPL) May 21, 2025
ముంబై నిర్దేశించిన 181 పరుగుల ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్(6)ను చాహర్ ఔట్ చేసి తొలి బ్రేకిచ్చాడు. రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ కేఎల్ రాహుల్(11)ను బౌల్ట్ వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే యువకెరటం అభిషేక్ పొరెల్(6)ను రికెల్టన్ స్టంపౌట్ చేసి ఢిల్లీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. 27 పరుగులకే మూడు కీలక వికట్లు పడిన ఢిల్లీని విప్రజ్ నిగమ్(20 నాటౌట్), సమీర్ రిజ్వీ (39)లు ఆదుకునే ప్రయత్నం చేశారు. జాక్స్ ఓవర్లో వరుసగా 6, 6, ఫోర్ బాదిన అతడు.. రిజ్వీతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, 6 ఓవర్లకు ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత బంతి అందుకున్న శాంట్నర్.. రిటర్న్ క్యాచ్‌తో విప్రజ్‌ను ఔట్ చేసి ఢిల్లీ కష్టాలను మరింత పెంచాడు.
Spin doing the trick for #MI 🕸
🎥 Will Jacks & Mitchell Santner put #DC on the backfoot with 2⃣ important wickets 💪
Updates ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/79RZQd79Cw
— IndianPremierLeague (@IPL) May 21, 2025
ఆ కాసేపటికే బుమ్రా బౌలింగ్‌లో స్టబ్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతే.. ఢిల్లీ ఓటమి అంచున నిలిచింది. కానీ, అశుతోష్ శర్మ(18) రాకతో స్కోర్ బోర్డు పరుగందుకుంది. కరణ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అశుతోష్ 4, 6 కొట్టగా.. రిజ్వీ 4 బాదాడు. ఆ తర్వాత బౌల్ట్ ఓవర్లో రిజ్వీ బౌండరీతో ఢిల్లీ స్కోర్ 100కి చేరింది. 38 రన్స్ జోడించి ఆశలు రేపిన ఈ జోడీని.. అయితే.. రిజ్వీని బౌల్డ్ చేసిన శాంట్నర్ ముంబైని విజయానికి చేరువ చేశాడు. అదే ఓవర్లో అశుతోష్ సైతం స్టంపౌట్‌గా వెనుదిరగగా.. ఢిల్లీ ఓటమి ఖాయమైంది. మధ్వల్ తివారీ(3)ని బుమ్రా బౌల్డ్ చేయగా.. కుల్దీప్ యాదవ్(7)ను కరన్ పెవిలియన్ పంపాడు. ముస్తాఫిజుర్‌ను బౌల్డ్ చేసిన బుమ్రా ముంబైకి 59 పరుగుల విజయాన్ని అందించాడు.
ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే కీలక పోరులో ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్(73 నాటౌట్) సునామీలా విరుచుకుపడ్డాడు. వాంఖడే మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ(5), రియాన్ రికెల్టన్ (25) విఫలమైనా.. తిలక్ వర్మ(27)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. అర్ధ శతకంతో మెరిసిన ఈ హిట్టర్.. ఢిల్లీ బౌలర్ల లయను దెబ్బతీస్తూ ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు.
Mr. Consistent Surya Kumar Yadav led MI’s fightback with 73*(43) 💪
🎥🔽 WATCH his masterful knock | #TATAIPL | #MIvDC | @mipaltan | @surya_14kumar
— IndianPremierLeague (@IPL) May 21, 2025
డెత్ ఓవర్లలో తనమార్క్ విధ్వసంక ఆటతో.. జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు సూర్య. కుర్రాడు నమన్ ధిర్(24 నాటౌట్) ముకేశ్ వేసిన 19వ ఓవర్లో 27 రన్స్ రాబట్టి స్కోర్ 150 దాటించాడు. ఇక చమీర బౌలింగ్‌లో సూర్య రెండు ఫోర్లు, సిక్సర్ బాదగా ముంబై 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.