జాగ్రెబ్(క్రొయేషియా): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ సూరజ్ వశిష్ట్ పోరాటం ముగిసింది. తొలిసారి సీనియర్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన సూరజ్ అంచనాలకు మించి రాణించాడు. పురుషుల 60కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని ఆకట్టుకున్నాడు.
క్వార్టర్స్‌కు ముందు జరిగిన రెండు బౌట్లలో సూరజ్ 3-1తో అంజెల్ టెల్లెజ్పై, 3-1తో విక్టర్(మాల్దోవా)పై అద్భుత విజయాలు సాధించాడు.