జైపూర్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్)వరుస విజయాలతో దూసుకెళుతున్నది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుస నాలుగో విజయంతో హైదరాబాద్(10) మూడోస్థానానికి ఎగబాకగా, రాజస్థాన్(10) నాలుగుకు చేరుకుంది. మ్యాచ్ విషయానికొస్తే రాజస్థాన్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
ఇషాన్‌కిషన్(31 బంతుల్లో 74, 11ఫోర్లు, 3సిక్స్‌లు), అభిషేక్‌శర్మ(29 బంతుల్లో 57, 11ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఆదిలోనే హెడ్(6) ఔటై నిరాశపరిచినా..అభిషేక్, ఇషాన్ బౌండరీలతో ఆకట్టుకున్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు విడిచిపెట్టడం హైదరాబాద్ బ్యాటర్లకు కలిసొచ్చింది. వచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఇషాన్ కిషన్, అభిషేక్ చెలరేగడంతో హైదరాబాద్ పవర్‌ప్లే పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది.
అభిషేక్ 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, కిషన్ అదే ఒరవడి కొనసాగించాడు. అయితే ఫెరీరా బౌలింగ్‌లో అభిషేక్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యానికి పుల్‌స్టాప్ పడింది. అభిషేక్‌ను అనుసరిస్తూ ఇషాన్ కూడా పెవిలియన్ చేరినా..మిడిల్లో నితీశ్‌కుమార్(36), క్లాసెన్(29) నిలకడ కొనసాగించారు. ఆఖర్లో సలీల్(8 నాటౌట్), అనికేత్(1 నాటౌట్) గెలుపు తీరాలకు చేర్చారు. బ్రిజేశ్(2/44), ఆర్చర్(2/34) రెండేసి వికెట్లు తీశారు.
అంతకుముందు వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 103, 5ఫోర్లు, 12 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో రాజస్థాన్ 20 ఓవర్లలో 228/6 స్కోరు చేసింది. జురెల్(51), ఫెరీరా(33) మినహా మిగతా బ్యాటర్లు విఫలమైనా సూర్యవంశీ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో మూడో వేగవంతమైన సెంచరీతో ఆకట్టుకున్న ఈ 15 ఏండ్ల బుడ్డోడు..హైదరాబాద్ బౌలర్లకు దీటుగా బదులిచ్చాడు. గత పోరులో డకౌట్‌గా వెనుదిరిగిన సూర్యవంశీ..ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కెరీర్లో రెండో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. జైస్వాల్(10), కెప్టెన్ రియాన్ పరాగ్(7), హెట్‌మైర్(11) ఘోరంగా నిరాశపరిచారు. మలింగ(2/38) రాణించాడు. కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రాజస్థాన్: 20 ఓవర్లలో(సూర్యవంశీ 103, జురెల్ 51, మలింగ 2/38, నితీశ్ 1/20),
హైదరాబాద్: 18.3 ఓవర్లలో 229/5(కిషన్ 74, అభిషేక్ 57, ఆర్చర్ 2/34, బ్రిజేశ్ 2/44)