న్యూఢిల్లీ: గాయపడ్డ స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో యువ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టులోకి తీసుకుంది. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపిన 22 ఏండ్ల దూబే కనీస ధర 30 లక్షలతో ఎస్ఆర్హెచ్లోకి వచ్చాడు. ఇటీవల ముగిసిన రంజీ టోర్నీలో విదర్భ తరఫున బరిలోకి దిగిన దూబే 476 పరుగులకు తోడు 69 వికెట్లతో అదరగొట్టాడు.
తన కెరీర్లో ఇప్పటి వరకు 16 టీ20లు, 20 లిస్ట్-ఏ, 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన దూబే 127 వికెట్లతో పాటు 941 పరుగులు చేశాడు. మరోవైపు గాయపడ్డ వన్శ్ బేడి స్థానంలో గుజరాత్ సంచలనం ఉర్విల్ పటేల్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ తీసుకుంది. మోకాలి గాయంతో బేడి లీగ్‌కు దూరం కావడంతో సీఎస్కే..ఉర్విల్‌ను ఎంపిక చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో త్రిపురపై 28 బంతుల్లోనే ఉర్విల్ రికార్డు సెంచరీతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.