SA 20: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజన్ హోరీహోరీగా జరుగుతోంది. పవర్ హిట్టర్లు బౌలర్లను ఉతికారేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఇక యువ క్రికెటర్లు అయితే స్టన్నింగ్ షాట్లతో అలరిస్తున్నారు. శనివారం ఎంఐ కేప్‌టౌన్(MI Cape Town)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) జట్టు వికెట్ కీపర్ ట్సిస్టన్ స్టబ్స్(Tristan Stubbs) ఓ ఖతర్నాక్ షాట్ ఆడాడు. ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్(Kieron Pollard) బౌలింగ్‌లో అతడు కండ్లు చెదిరే సిక్సర్ కొట్టాడు.
పోలార్డ్ వేసిన 17వ ఓవర్లో స్టబ్స్ రివర్స్ స్వీప్‌తో సిక్సర్ బాదాడు. లెగ్ స్టంప్స్ దిశగా వెళ్తున్న బంతిని ఈ యంగ్‌స్టర్ అమాంతం స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, పోలార్డ్‌తో పాటు అభిమానులు సైతం వాట్ ఏ షాట్ అంటూ ఆశ్చర్యపోయారు. దూకుడుగా ఆడే క్రమంలో స్టబ్స్ 23 పరుగుల వద్ద ఔటయ్యాడు.
𝙄𝙛 𝙩𝙝𝙖𝙩’𝙨 𝙣𝙤𝙩 𝙩𝙝𝙚 𝙗𝙚𝙨𝙩 𝙨𝙝𝙤𝙩 𝙨𝙤 𝙛𝙖𝙧, 𝙬𝙚 𝙙𝙤𝙣’𝙩 𝙠𝙣𝙤𝙬 𝙬𝙝𝙖𝙩 𝙞𝙨! 😱#Betway #SA20 #WelcomeToIncredible #SECvMICT pic.twitter.com/2gxE4gmYFb
— Betway SA20 (@SA20_League) January 27, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టులో కెప్టెన్ ఎయిడెన్ మర్క్రమ్(52), టామ్ అబెల్(60) హాఫ్ సెంచరీతో రాణించారు. దాంతో, ఆ ఈస్టర్న్ 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు కొట్టింది. రబడ, నువాన్ తుషార రెండేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ కేప్‌టౌన్ జట్టు 171 పరుగులకే పరిమితమైంది. దాంతో, మర్క్రమ్ సేన 4 పరుగుల తేడాతో గెలుపొందింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన టామ్ అబెల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.