Govind PadmaSoorya | అల.. వైకుంఠపురంలో సినిమాలో విలన్‌గా చేసిన గోవింద్ పద్మసూర్య గుర్తున్నాడా? అదేనండీ.. సముద్రఖని కొడుకు పైడితల్లిగా నటించిన నటుడు! తొలి సినిమాతోనే తెలుగువారికి చేరువయ్యాడు ఈ మలయాళీ నటుడు. అల.. వైకుంఠపురంలో సినిమా తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమాలతోనూ మెప్పించాడు. ఈయన ఇప్పుడు ఒక ఇంటివాడయ్యాడు. మలయాళీ సీరియల్ నటి గోపికా అనిల్‌ను గోవింద్ వివాహం చేసుకున్నాడు.
కేరళలోని ప్రముఖ వడక్కునాథ్ ఆలయంలో వీరి పెండ్లి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబందించిన ఫొటోలను గోవింద్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఇవి చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పద్మసూర్య విషయానికొస్తే టాలీవుడ్లో విలన్‌గానే కాకుండా మలయాళంలో టీవీ షోలకు హోస్ట్‌గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గోపిక విషయానికొస్తే.. మలయాళంలో పలు సూపర్‌హిట్ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించింది. గత ఏడాది అక్టోబర్‌లో గోవింద్, గోపికల నిశ్చితార్థం జరిగింది. అయితే ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందినవారు కావడంతో వీరిది లవ్ మ్యారేజ్ అని చాలామంది అనుకున్నారు. కానీ తమది లవ్ మ్యారేజ్ కాదని.. పెద్దలు కుదిర్చిన పెండ్లే అని ఇటీవల పద్మసూర్య ఓ ఇంటర్వ్యూలోనూ క్లారిటీ ఇచ్చాడు.