షిల్లాంగ్ : భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ రీఎంట్రీ అదిరిపోయింది. రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చిన ఛెత్రీ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3-0తో మాల్దీవులుపై అద్భుత విజయం సాధించింది. దీంతో గత 12 మ్యాచ్ల్లో ఓటములకు తెరపడింది. టీమ్ఇండియా తరఫున రాహుల్ బెకె(35ని), లిస్టన్ కొలాకో(66ని), సునీల్ ఛెత్రీ(76ని) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్లో మూడింటికి మూడు హెడర్ గోల్స్ కావడం విశేషం.