Sumit Nagal | ఢిల్లీ: ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్‌లో భారత టెన్నిస్ సింగిల్స్ క్రీడాకారుడు సుమిత్ నాగల్ ఆడనున్నాడు. యూఎస్ ఓపెన్ బుధవారం విడుదల చేసిన మెయిన్ డ్రా జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు.
ఐటీపీ ర్యాంకింగ్స్‌లో 68వ ర్యాంకు దక్కించుకున్న నాగల్.. ఈ ఏడాది వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ ఆడనుండటం గమనార్హం. దీంతో 2019లో పి. గున్నేశ్వరన్ తర్వాత ఒక ఏడాది అన్ని గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్‌లో పాల్గొననున్న తొలి ఆటగాడిగా నాగల్ నిలిచాడు.