అక్లాండ్ : ఏఎస్‌బీ క్లాసిక్ ఏటీపీ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మెయిన్‌డ్రాకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన అర్హత రౌండ్ పోరులో నాగల్ 7-6(5), 6-3తో అడ్రియన్ మనారినో(ఫ్రాన్స్)పై అద్భుత విజయం సాధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 98వ ర్యాంక్‌లో ఉన్న నాగల్ తనకంటే మెరుగైన ర్యాంక్ (66)లో ఉన్న అడ్రియన్‌ను మట్టికరిపించాడు. ఇటీవల పలు జరిగిన పలు టోర్నీల్లో మొదటి రౌండ్లలోనే నిష్క్రమించిన నాగల్.. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.