Sumit Nagal | ఢిల్లీ: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నాడు. గత కొంత కాలంగా ఒక్కో టోర్నీలో నిలకడైన ప్రదర్శనలతో రాణిస్తున్న నాగల్ తాజాగా 5 స్థానాలు మెరుగుపరుచుకుని 68వ ర్యాంక్‌కు చేరాడు. కెరీర్లో అతడికిదే అత్యుత్తమ ర్యాంకు.
భారత్ టెన్నిస్ చరిత్రలో ఏటీపీ ర్యాంకింగ్స్ జాబితాలో నాగల్ది నాలుగో బెస్ట్ ర్యాంకు కావడం విశేషం. 1980లో విజయ్ అమృత్‌రాజ్ (18వ ర్యాంకు), రమేశ్ కృష్ణన్ (1985లో 23), సోమ్‌దేవ్ (2011లో 62) తర్వాత నాగల్ నిలిచాడు.