దుండిగల్, అక్టోబర్24: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన సుహాన్ ప్రీతం స్మిమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రతిభను చాటుతూ ఈనెల 27 నుండి 30వ తేది వరకు బహ్రెయిన్‌లోని మనామాలో జరుగనున్న మూడో ఆసియా యూత్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు.
అండర్-18 విభాగంలో జరిగే స్విమ్మింగ్ పోటీల్లోని ఫ్రీ ైస్టెల్, బ్యాక్ స్ట్రోక్, బెస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై విభాగాల్లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం ఏడుగురు అర్హత సాధించగా అందులో సుహాన్ ఒకరు కావడం గమనార్హం.