IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై అదిరే విజయం తో తొలి బెర్తును కైవసం చేసుకుంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్(108 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్ గిల్(93 నాటౌట్) సైతం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చితక్కొట్టిన ఈ కుర్ర జోడీ.. జట్టును 10 వికెట్ల తేడాతో గెలిపించింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్తు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ విక్టరీతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు సైతం నాకౌట్ పోరుకు అర్హత సాధించాయి.
ఐపీఎల్లో అడుగు పెట్టిన తొలి సీజన్లోనే కప్ కొట్టిన గుజరాత్ టైటాన్స్.. మరో టైటిల్ వేటలో దూసుకెళ్లుతోంది. ఆదివారం డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది గుజరాత్. ప్రత్యర్థి నిర్దేశించిన 200 ఛేదనలో ఓపెనర్లు దంచేశారు. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్(108 నాటౌట్) ఫోర్లతో అలరించాడు. అక్షర్ పటేల్ వేసిన తొలి ఓవర్లో సాయి బౌండరీ కొట్టగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(93 నాటౌట్) సిక్సర్ బాదాడు. అనంతరం నటరాజన్ ఓవర్లో సాయి రెచ్చిపోయి 6, 4, 4, 4 సాధించాడు. వీళ్లిద్దరూ ధనాధన్ ఆడుతుండంతో 26 బంతుల్లోనే 50 పరుగులు వచ్చాయి. దాంతో, గుజరాత్ 6 ఓవర్లలో 59 పరుగులు చేసింది.
𝙎𝙖𝙞-𝙙 𝙞𝙩 𝙬𝙞𝙩𝙝 𝙖 𝙎𝙄𝙓 🫡
A stunning century in a dream season for #GT star Sai Sudharsan 💙
Updates ▶ https://t.co/4flJtatmxc #TATAIPL | #DCvGT | @gujarat_titans | @sais_1509 pic.twitter.com/O0vzstT1gD
— IndianPremierLeague (@IPL) May 18, 2025
సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి ఆ కాసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీతో ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు సుదర్శన్. 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో యాభై మార్క్ అందుకున్నాడీ హిట్టర్. అదే ఓవర్లో శుభ్‌మన్ గిల్(28 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో గుజరాత్ స్కోర్ 80 దాటింది. చమీర వేసిన 12వ ఓవర్లో ఫోర్‌తో గిల్ కూడా ఫిప్టీ సాధించాడు. అదే ఓవర్లో సాయి కూడా బౌండరీ కొట్టగా 19 పరుగులు వచ్చాయి. వికెట్ తీసే బౌలర్ కరువవడంతో ఈ జోడీ బౌండరీలతో రెచ్చిపోయింది. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో శివాలెత్తిపోయిన గిల్.. వరుసగా 4, 6 బాదాడు. కుల్దీప్ ఓవర్లో స్ట్రెయిట్‌గా సిక్సర్ బాదిన సాయి ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించాడు. విప్రజ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జట్టకు 10 వికెట్ల విజయాన్ని అందించాడు.
Playoffs: Secured ✅
Belief: Unshaken 💪
Eyes: On the Prize 🏆@RCBTweets storm into the Playoffs with fire and focus 🔥#TATAIPL | #DCvGT pic.twitter.com/R3YKviNSjX— IndianPremierLeague (@IPL) May 18, 2025
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్(112 నాటౌట్) గర్జించాడు. సూపర్ సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రాహుల్ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్లో తనకు తిరుగలేదని చాటుతూ ఐదో సెంచరీ సాధించాడు. అతడికి అభిషేక్ పొరెల్(30) సహకరించగా.. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దాంతో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.