హైదరాబాద్, ఆట ప్రతినిధి: గాడియం సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బుధవారం ఘనంగా ముగిసింది. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్, మేడ్చల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో ఉత్తమ్తన్మయ్ నిహాల్, అవని విక్రమ్ గోవింద్ విజేతలుగా నిలిచారు.
అండర్-15 బాలుర సింగిల్స్ ఫైనల్లో ఉత్తమ్ తన్మయ్ 21-19, 21-17తో తనీశ్రెడ్డిపై గెలిచి టైటిల్ విజేతగా నిలిచాడు. మరోవైపు బాలికల తుదిపోరులో అవని విక్రమ్ 21-11, 21-17తో మాన్య అగర్వాల్‌పై గెలిచింది. బాలుర డబుల్స్‌లో తనీశ్రెడ్డి, ఉత్తమ్ తన్మయ్ జోడీ, బాలికల డబుల్స్‌లో సహస్ర, మహేలా దాస్‌గుప్తా ద్వయం టైటిళ్లు సొంతం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి వర్ధమాన షట్లర్ ప్రియాంశు రజావత్ హాజరయ్యాడు.