Arya Priya Bhuyan | ముంబై: సోషల్‌మీడియా అనామకులను అందలమెక్కిస్తుంది! దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అభిమాని ఆర్యప్రియా భూయాన్ ఉదంతం. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోనీ ఔటైనప్పుడు కెమెరా కంటికి చిక్కిన ఆర్యప్రియ సోషల్‌మీడియాలో ప్రముఖంగా నిలిచింది.
రాత్రికి రాత్రే సెలెబ్రిటీ హోదా దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 48 గంటల వ్యవధిలో వెయ్యి నుంచి లక్షకు పైగా ఫాలోవర్లను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.