హైదరాబాద్, ఆట ప్రతినిధి: సౌత్ జోన్ నేషనల్ గోల్ఫ్ టోర్నీలో తెలంగాణ గురుకుల విద్యార్థులు నాలుగు పతకాలతో మెరిశారు. కొచ్చిన్లో జరుగుతున్న ఈ టోర్నీలో అమూల్య విజేతగా నిలువగా.. అనూష, అఖిల, హరిత రాణి వేర్వేరు విభాగాల్లో ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో మెరిసిన వర్ధమాన గోల్ఫర్లను గురుకుల పాఠశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించింది.