ECB | మళ్లీ కెప్టెన్‌గా స్టోక్స్.. నాలుగు మార్పులతో ఇంగ్లండ్ తుది జట్టు..!
ECB : కెన్నింగ్టన్ ఓవల్‌లో భంగపడిన ఇంగ్లండ్ సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. న్యూజిలాండ్‌ను నాటింగ్హమ్లో చిత్తు చేయాలనుకుంటున్న ఆతిథ్య జట్టు నాలుగు మార్పులు చేసింది.
ECB : కెన్నింగ్టన్ ఓవల్‌లో భంగపడిన ఇంగ్లండ్(England) సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. సిరీస్‌ను సమం చేసిన న్యూజిలాండ్‌ను నాటింగ్హమ్లో చిత్తు చేయాలనుకుంటున్న ఆతిథ్య జట్టు నాలుగు మార్పులు చేసింది. లండన్ నైట్ క్లబ్ వివాదం సద్దుమణగడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్లు తిరిగి జట్టులోకి వచ్చారు. వికెట్ కీపర్‌గా జేమీ స్మిత్ ఎంపికవ్వగా.. స్పిన్నర్‌గా షోయబ్ బషీర్‌ను సెలెక్టర్లు తీసుకున్నారు.
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 253 పరుగుల తేడాతో ఊహించని ఓటమి నుంచి తేరుకున్న ఇంగ్లండ్ మూడో టెస్టుకు పక్కాగా సిద్ధమైంది. జూన్ 25 గురువారం నాటింగ్హమ్లో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను తన్నుకుపోవాలనుకుంటున్న ఆతిథ్య జట్టు.. నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది.
JUST IN: Ben Stokes, Gus Atkinson and Jamie Smith return as England make four changes to their XI for the third Test against New Zealand in Nottingham 🏴
IN: Stokes, Smith, Atkinson, Bashir
OUT: Cox, Rew, Baker, Fisher pic.twitter.com/yLuYSKDSks— Cricinfo (@cricinfo) June 23, 2026
ఓవల్ టెస్టు ఆడిన జోర్డాన్ కాక్స్, రెవ్, సోనీ బేకర్, ఫిషెర్పై వేటు పడింది. బెన్ స్టోక్స్ తిరిగి కెప్టెన్సీ చేపట్టగా.. జేమీస్మిత్, సోయబ్ బషీర్, అట్కిన్సన్ తుది జట్టులోకి వచ్చారు.. రెట్టించిన ఉత్సాహంతో ఇంగ్లండ్ కనిపిస్తోంది.
ఇంగ్లండ్ తుది జట్టు : బెన్ డకెట్, ఎమిలియో గే, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), అట్సిన్సన్, ఆర్చర్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

