LSG vs MI | స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో.. ముంబైని చిత్తు చేసిన లక్నో
LSG vs MI : పదిహేడో సీజన్లో భారీ స్కోర్ల మ్యాచ్‌లకు బ్రేక్‌నిస్తూ.. లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సూపర్ విక్టరీ కొట్టింది.
LSG vs MI : పదిహేడో సీజన్లో భారీ స్కోర్ల మ్యాచ్‌లకు బ్రేక్‌నిస్తూ.. లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సూపర్ విక్టరీ కొట్టింది. మెగా టోర్నీలో పడుతూ లేస్తూ వస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబైని 144 రన్స్‌కే కట్టడి చేసిన రాహుల్ సేన స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. మార్కస్ స్టోయినిస్(62) అర్ధ సెంచరీతో చెలరేగగా.. రాహుల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో నికోలస్ పూరన్(1) లాంఛనం పూర్తి చేశాడు. ఆరో విజయం ఖాతాలో వేసుకున్న లక్నో మూడో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
స్వల్ప ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన కొత్త కుర్రాడు అర్షిన్ కులకర్ణి(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. నువాన్ తుషార వేసిన మొదటి ఓవర్లో అతడు ఎల్బీగా ఔటయ్యాడు. ఒక్క పరుగుకే ఒక వికెట్ పడడంతో కెప్టెన్ కేఎఎల్ రాహుల్(28), మార్కస్ స్టోయినిస్(62)లు జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. తుషార ఓవర్లో హెలిక్యాప్టర్ షాట్లతో బౌండరీలు బాదిన రాహుల్ లక్నో స్కోర్‌బోర్డులో వేగం తెచ్చాడు.
Whipped with flair! 😎
KL Rahul unleashes the helicopter shot 🤌🚁
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvMI pic.twitter.com/kgNyqlFj1Y
— IndianPremierLeague (@IPL) April 30, 2024
అయితే.. హాఫ్ సెంచరీ భాగస్వామ్య నెలకొల్పిన ఈ జోడీని హార్దిక్ పాండ్య విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా(18)తో కలిసి స్టోయినిస్ దంచాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ద శతకం సాధించి లక్నోను విజయానికి చేరువ చేశాడు. నబీ ఓవర్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద దొరికాడు. ఆ తర్వాత అష్టన్ టర్నర్(5), బదొని(6)లు ఔటైనా.. కృనాల్ పాండ్యా(1)తో కలిసి పూరన్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించాడు.
వధేరా ఒక్కడే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) 144 పరుగులకే పరిమితమైంది. స్టోయినిస్, మొహ్సిన్ ఖాన్ విజృంభించడంతో ఆదిలోనే బర్త్‌డే బాయ్ రోహిత్ శర్మ(4), సూర్యకుమార్ యాదవ్(10)లు వెనుదిరిగారు. 18 పరుగులకే రెండు వికెట్లు పడిన ముంబైని ఆదుకుంటాడనుకున్న తిలక్ వర్మ(7)ను బిష్ణోయ్ సూపర్ త్రోతో రనౌట్ చేశాడు. ఆ కాసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా(0)ను నవీన్ ఉల్ హక్ గోల్డెన్ డక్‌గా డగౌట్‌కు చేర్చాడు.
నేహల్ వధేరా(46)

ఆ దశలో.. ఓపెనర్ ఇషాన్(32), నేహల్ వధేరా(46) ఒత్తిలోనూ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడారు. ఆడపాదడపా బౌండరీలు బాది ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ శతకానికి 4 పరుగుల దూరంలో ఉన్నవధేరాను యార్కర్‌తో మొహ్సిన్ ఖాన్ బౌల్డ్ చేసి ముంబైని ముంచాడు. ఆఖర్లో హిట్టర్ టిమ్ డేవిడ్(35 నాటౌట్) పోరాడడంతో పాండ్యా సేన 7 వికెట్ల నష్టానికి 144 రన్స్ కొట్టింది. లక్నో బౌలర్లలో మొహ్సిన్ రెండు, బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

