Stephen Fleming : ఐపీఎల్ కోచింగ్ దిగ్గజంగా పేరొందిన స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) ప్రస్థానం ముగిసింది. 18 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కోచ్‌గా సేవలందించిన ఫ్లెమింగ్.. 20వ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీకి బైబై చెప్పేశాడు. సుదీర్ఘ సమయం ఎల్లో ఆర్మీకి శిక్షణనిచ్చిన ఈ న్యూజిలాండ్ వెటరన్.. వీడ్కోలు ప్రకటనలో భావోగ్వేగానికి లోనయ్యాడు. చెన్నై జట్టుతో తన అనుబంధాన్ని, బృందంగా తాము సాధించిన విజయాలను ఈ సందర్భంగా అతడు గుర్తు చేసుకున్నాడు.
ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఈ రికార్డు చాలదా.. కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ విజయవంతం అయ్యాడని చెప్పడానికి. ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్సీకి.. తన కోచింగ్ నైపుణ్యాలతో చెన్నైని దిగ్గజ జట్టుగా తీర్చిదిద్దిన ఫ్లెమింగ్.. గత రెండు సీజన్లలో తేలిపోయాడు. మహీభాయ్ జట్టులో లేకపోవడం, కుర్రాళ్లను సమన్వయం చేయడంలో ఇబ్బందలు.. ఫలితంగా సీఎస్కే ఆట లయ తప్పింది. ఇంకేముంది.. ఇక చాలు నీ సేవలు అంటూ ఫ్రాంచైజీ అతడి మొహం మీదే చెప్పేసింది. అతడు కూడా.. ధోనీ లేని టీమ్‌ను నడిపించడం కష్టం అనుకున్నాడేమో సరేలే అని చెప్పేశాడు. అంతే.. ఐపీఎల్ చరిత్రలో గొప్ప అధ్యాయం ముగిసింది.
Stephen Fleming, a constant in CSK’s journey 👏 pic.twitter.com/Vlxda5tX25
— Cricinfo (@cricinfo) July 13, 2026
ఏదైనా ఆటలో 18 ఏళ్లు.. ఓ జీవితకాలం జ్ఞాపకాలు మిగిలిస్తుంది. ఎంతో కృతజ్ఞతతో చెన్నైని వీడుతున్నా. చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగడం నా కోచింగ్ కెరీర్లోనే అతిగొప్ప గౌరవం. మేము బృందంగా చాలా సాధించాం. ఎన్నో కష్ట సమయాలను అధిగమించాం. ఎల్లప్పుడూ నాతో ఉండిపోయే జ్ఞాపకాలను పోగేసుకున్నా. సీఎస్కే ఫ్రాంచైజీ నా హృదయానికి ఎంతో దగ్గరైనది. ఇకపై కూడా చెన్నై జట్టుకు మద్దతు ప్రకటిస్తాను అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
OFFICIAL ANNOUNCEMENT
The Super Kings and Head Coach Stephen Fleming have mutually decided to part ways.
Together, we shared one of the most successful and enduring partnerships in IPL history. The legacy you’ve built will continue to inspire us.With immense respect and… pic.twitter.com/qjvb4oZUuU
— Chennai Super Kings (@ChennaiIPL) July 13, 2026
ఫ్లెమింగ్ వైదొలగడంతో తదుపరి కోచ్ ఎవరనేది? ఆసక్తి రేపుతోంది. 19వ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీకి తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశముంది. అతడు కాందటే.. కోచ్ వేటను చెన్నై మొదలెటట్నుంది. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న హేమాంగ్ బదానీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సీఎస్కే ప్రతినిధులు తెలిపారు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఆటగాడిగా ఫ్లెమింగ్ జట్టులో చేరాడు. ఆ తర్వాత 2009 నుంచి కోచింగ్ బృందంలో చేశాడు. 2016, 2017లో చెన్నై జట్టుపై నిషేధం కారణంగా.. అతడు పూణె జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. 2017లో పూణె జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లెమింగ్ హయాంలో చెన్నై జట్టు 11 సార్లు ఫైనల్స్ ఆడింది. 10 సార్లు ఐపీఎల్లో, ఓ సారి చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. మొత్తంగా ఆరు సార్లు జట్టు టైటిల్ గెలిచింది.