హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆసియా యూనివర్సిటీ టోర్నీకి రాష్ట్ర యువ లిఫ్టర్ సుమేరా ఖాతూన్ ఎంపికైంది. గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న సుమేరా..ఆసియా టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
షార్జా వేదికగా ఆగస్టు 17-21 తేదీల్లో జరిగే ఆసియా యూనివర్సిటీ టోర్నీలో సుమేరా బరిలోకి దిగనున్నట్లు కోచ్ కౌశిక్ పేర్కొన్నాడు.