హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఖేలోఇండియా పారా గేమ్స్‌లో తెలంగాణ పతక ఖాతా తెరిచింది. పోటీలకు తొలిరోజైన శుక్రవారం జరిగిన మహిళల 100మీటర్ల టీ11 విభాగంలో రాష్ట్ర యువ అథ్లెట్ శిరీష రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన రేసును శిరీష 16.55 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది.
ముత్తుస్వామి సంచలనం ; ప్రపంచ రెండో ర్యాంకర్ అంటోన్సెన్‌పై గెలుపు
బాసెల్: స్విట్జర్లాండ్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ శంకర్ ముత్తుస్వామి సంచలన విజయంతో సత్తా చాటాడు. శుక్రవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శంకర్18-21, 21-12, 21-5తో ప్రపంచ రెండో ర్యాంకర్, డెన్మార్క్ షట్లర్అంటోన్సెన్ను మట్టికరిపించాడు. 21 ఏండ్ల ఈ తమిళనాడు కుర్రాడి ప్రపంచ ర్యాంకు 64 కాగా అతడి కంటే ఎన్నో రెట్లు మెరుగైన అంటోన్సెన్ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ 21-18, 21-14తో హంకాంగ్ ద్వయంపై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది.