న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్(Brij Bhushan) వాంగ్మూలాన్ని ఇవాళ ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. బ్రిజ్ భూషణ్ లైంగిక దాడికి పాల్పడినట్లు టాప్ రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు బ్రిజ్ భూషణ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని పోలీసులు ఆయన్ను కోరారు. ఒకవేళ అవసరమైతే మళ్లీ వాంగ్మూలాన్ని తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే తానేమీ లైంగిక నేరానికి పాల్పడలేదని బ్రిజ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తనపై ఉన్న అన్ని ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ కార్యదర్శి వినోద్ తోమర్ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో అతని పేరు కూడా ఉంది.
ఈ కేసును విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్‌లో 10 మంది అధికారులు ఉన్నారు. దీంట్లో ఓ మహిళా డిప్యూటీ కమీషనర్ కూడా ఉన్నారు.