Raja Rithvik | హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాసిక్(మహారాష్ట్ర) వేదికగా జరిగిన జాతీయ ర్యాపిడ్ చెస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ రాజా రిత్విక్ కాంస్య పతకంతో మెరిశాడు. బుధవారంతో ముగిసిన టోర్నీలో రిత్విక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 11 రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో రిత్విక్ 8.5 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఏడు గేమ్‌లు గెలిచిన ఈ యువ జీఎం మూడు గేమ్‌లు డ్రా చేసుకోవడంతో ఒకటి ఓడిపోయాడు.
రిత్విక్ ప్రస్తుతం రామరాజు దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయ ర్యాపిడ్ టోర్నీలో కాంస్యం సాధించిన రిత్విక్‌ను రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. భవిష్యత్‌లో రిత్విక్ మరిన్ని విజయాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.