హైదరాబాద్, ఆట ప్రతినిధి: రువాండ వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ ఐటీఎఫ్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ జీ సాయికార్తీక్రెడ్డి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో కార్తీక్ 6-2, 7-6(7-4) తేడాతో రిషిరెడ్డిపై విజయం సాధించాడు. టోర్నీలో తనదైన జోరు కనబరుస్తున్న కార్తీక్ వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి ప్రిక్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. అంతకముందు జరిగిన అర్హత రౌండ్ మ్యాచ్‌ల్లో ఎతన్ టెర్బలాంచె(రష్యా)తో పాటు భారత్‌కు చెందిన దార్మిల్షాపై గెలిచి ప్రధాన డ్రాకు అర్హత సాధించాడు.