హైదరాబాద్, ఆట ప్రతినిధి: హిమాచల్‌ప్రదేశ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా మహిళల వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ లిఫ్టర్ వీ సాహితి కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల జూనియర్ 76 కిలోల విభాగంలో బరిలోకి దిగిన సాహితి మొత్తం 164 కిలోలు (స్నాచ్‌లో 73కి+ క్లీన్ అండ్ జర్క్‌లో 91కి) ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన సాహితి అద్భుత ప్రదర్శనపై పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.