బ్రెజిల్, స్విట్జర్లాండ్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్లో చిన్న అవాంతరం చోటు చేసుకుంది. మ్యాచ్ ప్రథమార్ధం మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా అనుకోకుండా స్టేడియం ఫ్లడ్లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కల్గింది. వెంటనే మళ్లీ పూర్తిస్థాయిలో లైట్లు రావడంతో మ్యాచ్ కొనసాగింది. ఫిఫా ప్రపంచకప్ కోసం ఖతార్ నిర్మించిన 8 స్టేడియాల్లో ‘స్టేడియం 974’ది వినూత్న శైలి. ఖతార్ అంతర్జాతీయ టెలిఫోన్ కోడ్ను సూచించడంతో పాటు స్టేడియం నిర్మాణం కోసం 974 కంటెనర్లను వాడారు. దోహా పోర్ట్ ప్రాంతంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని ప్రపంచకప్ ముగిసిన తర్వాత కూలగొట్టనున్నారు.