Athletics Championship | నాగర్కర్నూల్, అక్టోబర్ 19 : అథ్లెటిక్స్ పోటీలో నాగర్కర్నూల్ జిల్లా వాసి ప్రతిభ చాటాడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు)లో జరుగుతున్న 35వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన కాట్రావత్ శ్రీను సత్తా చాటాడు. మొదటిరోజు శనివారం జరిగిన 1500 మీటర్ల పరుగు పందాన్ని 3:55.7 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త మీట్ రికార్డు నెలకొల్పాడు. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు.