ICC : టీ20 ప్రపంచకప్ టోర్నీకి గడవు సమీపిస్తున్న వేళ మ్యాచ్ అధికారులను ఐసీసీ ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో లీగ్ దశ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు 30 మందిని ఎంపిక చేయగా వీరిలో ఇద్దరు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. అంపైర్‌గా నితిన్ మీనన్ (Nitin Menon), రిఫరీగా జవగళ్ శ్రీనాథ్ (Javagal Srinath)లు ఎంపికయ్యారు. త్వరలోనే సూపర్ 8, నాకౌట్ మ్యాచ్‌లకు అధికారుల పేర్లను వెల్లడిస్తామని ఐసీసీ తెలిపింది. 24 మంది ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. ఆరుగురు మ్యాచ్ రిఫరీలుగా సేవలందించనున్నారు.
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక వేదికగా పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటిచడంతో పాటు.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు చోటు కల్పించిన ఐసీసీ శుక్రవారం మ్యాచ్ అఫీషియల్స్‌ను ప్రకటించింది. అంతర్జాతీయ అనుభవానికి ప్రాధాన్యమిస్తూ 30 మంది (24మంది ఆన్ ఫీల్డ్ అంపైర్లు, ఆరుగురు మ్యాచ్ రిఫరీలు)కి వరల్డ్‌కప్ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టింది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
ICC announces the complete list of match referees and umpires for the T20 World Cup 2026! 🇮🇳🇱🇰🏆#T20WorldCup #AndrewPycroft #JavagalSrinath #Sportskeeda pic.twitter.com/RztA1ZUHJ1
— Sportskeeda (@Sportskeeda) January 30, 2026
బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ (Sharfuddoula Ibne Shahid)కు కూడా చోటు దక్కడం గమనార్హం. భద్రతా కారణాలతో భారత్‌లో ఆడలేమని వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేసిన ఆ దేశానికి బుద్ది చెబుతూ.. షర్ఫుద్దౌలాకు వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసే అవకాశమిచ్చింది ఐసీసీ. ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగే ఆరంభ మ్యాచ్‌కు కుమార ధర్మసేన అంపైరింగ్ చేయనున్నారు. ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ధర్మసేనతో పాటు ఇల్లింగ్‌వర్త్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు.
ICC has confirmed the match officials for the group stage of the Men’s T20 World Cup 2026
Details: https://t.co/kMlTnJ7PMz#TOKSports #T20WorldCup #PAKvIND pic.twitter.com/qUrPR7kAsn
— TOK Sports (@TOKSports021) January 30, 2026
మ్యాచ్ రిఫరీలు : జవగళ్ శ్రీనాథ్, డీన్ కొస్కెర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మడుగల్లే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రికీ రిచర్డ్సన్.
అంపైర్లు : నితిన్ మీనన్, రొనాల్డ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార ధర్మసేన, క్రిస్ గఫానే, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, వేనీ నైట్స్, డొనొవాన్ కాచ్, జయరామన్ మదనగోపాల్, సామ్ నొగజస్కీ, కేఎన్ఏ పద్మనాభన్, అల్లాహుద్దీన్ పాలేకర్, అహ్సన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫిల్, లాంగ్టన్ రుసెరె, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, గాజీ సోహెల్, రాడ్ టక్నర్, అలెక్స్ వార్ఫ్, రవీంద్ర విమలసిరి, అసిఫ్ యాకుబ్.