SLW vs PAKW : కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ టాస్కు అడ్డుపడిన వరుణుడు శాంతించాడు. రెండున్నర గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు 17:45 గంటలకు టాస్ వేశారు. చివరి మ్యాచ్లో విజయంతో టోర్నీకి ముగింపు పలకాలనే ఉద్దేశంతో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. ఇప్పటివరకూ ప్రపంచ కప్లో బోణీ కొట్టని పాక్ సైతం విజయంపై కన్నేసింది. సో.. రెండు టీమ్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.
టాస్కు ముందే వర్షం మొదలవ్వడంతో శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ ఓవర్లు కుదించారు అంపైర్లు. రెండున్నర గంటల సమయం వృథా కావడంతో, 34 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తున్నారు. సవరించిన ఓవర్ల ప్రకారం పవర్ ప్లే.. బౌలింగ్ నిబంధనలు కూడా మారాయి. ఏడు ఓవర్లకు పవర్ ప్లే ముగియనుంది.
🚨 We are going to have a game in Colombo! pic.twitter.com/pXy56yuMR8
— ESPNcricinfo (@ESPNcricinfo) October 24, 2025
పాకిస్థాన్ తుది జట్టు : మునీబా అలీ(వికెట్ కీపర్), ఒమైమా సొహైల్, సిద్రా అమిన్, అలియా రియాజ్, నటాలియా పర్వేజ్, ఫాతిమా సనా(కెప్టెన్), ఎమన్ ఫాతిమా, సైదా అరూబ్, రమీన్ షమీమ్, నష్రా సంధు, సడియా ఇక్బాల్.
శ్రీలంక తుది జట్టు : విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నీలాక్షి డిసిల్వా, అనుష్కా సంజీవని(వికెట్ కీపర్), దెవ్మీ విహంగ, సుగంధ కుమారి, మల్కీ మదరా, ఇనోక రణవీర.