క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి సమరానికి సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో పూణేలోని ఎంసీఏ స్టేడియలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. తర్వాత మంచు ప్రభావం పడే అవకాశం ఉందని, అలాగే పిచ్‌పై గడ్డి కూడా పొట్టిగా ఉందని చెప్పాడు.
చాలా మంది జట్టు సభ్యులు చాలా రోజులుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారని అన్నాడు. అలాగే స్టెయిన్, మురళీధరన్, లారా నుంచి అద్భుతమైన టిప్స్ తీసుకున్నామని చెప్పాడు. ఇదే సమయంలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. జట్టులో ఏడుగురు సభ్యులు కొత్తగా ఈ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నారని చెప్పాడు. జాస్ బట్లర్, హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్ నీల్ తమ విదేశీ ప్లేయర్లని వెల్లడించాడు.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్ నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్లన్ సుందర్, రొమేరియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్