ముల్లన్పూర్: ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరును చిత్తు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఆర్సీబీ, గుజరాత్‌తో సమానంగా 16 పాయింట్లు నెగ్గినా.. రన్‌రేట్‌లో కాస్త వెనుబడి మూడో స్థానంతో సరిపెట్టిన సన్‌రైజర్స్ బుధవారం రాత్రి జరిగే ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్‌కు పెట్టి టోర్నీలో ముందుకెళ్లాలని డిసైడింది. ఈ హై-ప్రెషర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధించనుండగా.. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
లీగ్ దశలో నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ, ద్వితీయార్థంలో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులోకి వచ్చాక ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి సన్‌రైజర్స్ ఊపుమీద ఉంది. లీగ్ దశలో రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించడం కమిన్స్ సేన మానసిక ఆధిక్యంతో బరిలోకి దిగుతోంది.మరోవైపు రియాన్ పరాగ్ సారథ్యంలోని రాయల్స్ లీగ్ దశ చివరి రోజు ముంబైపై భారీ విజయంతోప్లేఆఫ్స్ చేరుకొని పట్టుదలగా ఉంది. ముల్లాన్‌పూర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడం.. ఇరు జట్లలోనూ భారీ హిట్లర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల మోత మోగే అవకాశం ఉంది.