లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలింగ్ దళం రాణించింది. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ బౌలర్లు.. మధ్యలో గాడి తప్పారు. మళ్లీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో జట్టును 169 పరుగులకు కట్టడి చేయగలిగారు. అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే ఆరంభం అందించాడు.
లక్నో స్టార్లు క్వింటన్ డీకాక్ (1), ఎవిన్ లూయిస్ (1)ను సింగిలి డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే (11) కూడా నిరాశపరిచాడు. అయితే దీపక్ హుడా (51) మరోసారి జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (68)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించేలా కనిపించాడు.
కానీ అతన్ని షెఫర్డ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆయుష్ బదోని (19) కూడా ఫర్వాలేదనిపించాడు. కృనాల్ పాండ్యా (6), జేసన్ హోల్డర్ (8 నాటౌట్) పరుగులు చేయడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమేరియో షెఫర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు.
NAT2️⃣ 💪🏾
Two strikes in one over. What a way to celebrate his birthday. 🔥
Over to the batsmen to do their job now. #SRHvLSG #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/oIOIU6WQxI
— SunRisers Hyderabad (@SunRisers) April 4, 2022