లక్నో సూపర్ జెయింట్స్‌ను మరోసారి దీపక్ హుడా (51) ఆదుకున్నాడు. క్వింటన్ డీకాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీష్ పాండే (11) తక్కువ స్కోర్లకే అవుటవడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హుడా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ అండగా రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.
అయితే ఆ తర్వాత షెఫర్డ్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్టంప్స్‌కు దూరంగా జరిగిన హుడా రూమ్ తీసుకున్న హుడా.. బంతిని సరిగ్గా బాదలేకపోయాడు. దాంతో బౌండరీ లైన్ వద్ద త్రిపాఠీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. హుడా అవుటయ్యే సమయానికి లక్నో జట్టు 114 పరుగులతో ఉంది. హుడా అవుటైన కాసేపటికే కెప్టెన్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో అతనితోపాటు యువ సంచలనం ఆయుష్ బదోని ఉన్నాడు.