లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సన్రైజర్స్ ఇబ్బందులు మొదలయ్యాయి. సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి విలియమ్సన్ అవుటయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతికే బౌండరీ బాదిన విలియమ్సన్.. మూడో బంతిని కీపర్, షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ల తలల మీదుగా పంపేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతిని అంచనా వేయడంలో విఫలం అవడంతో బంతి.. బ్యాటు కింది భాగాన్ని తాకి షార్ట్ ఫైన్లో ఉన్న టై వైపు వెళ్లింది. దాన్ని అతను అందుకోవడంతో విలియమ్సన్ చిరాగ్గా వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులోఅభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఉన్నారు.